Story of Street light

స్ట్రీట్ లైట్ గురించి రాయాలి అనుకున్నప్పుడు దాని గురించి ఏముంటుంది రాయడానికి అనిపించింది. కానీ పరిశీలిస్తే చాలా పాజిటివ్ విషయాలు నాకు కనబడ్డాయి. అందులో కొన్ని.... చీకటి వీధిలో మనం నడవడానికి భయపడతాం, కానీ అక్కడ స్ట్రీట్ లైట్ ఉంటే దాని వెలుతురులో ధైర్యంగా వెళ్లిపోతాము. ఇలానే కదా జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనలో వెలుగును నింపుకొని ధైర్యంగా ముందుకెళ్లాలి. స్ట్రీట్ లైట్ కి ఆకర్షించబడిన రెక్కల పురుగులు దాని చుట్టూ తిరిగి తిరిగి చివరకు కింద పడి చనిపోతాయి. అది ఆకర్షణ అన్న నిజాన్ని తెలుసుకోలేవు. అలానే కదా మనం జీవితంలో ఆకర్షణల నుండి తప్పించుకుని, అద్భుతాల వైపు ప్రయాణించాలి. రాత్రిపూట దారంతా వెలుతురు నింపే స్ట్రీట్ లైట్ పగటిపూట పని లేక మౌనంగా నిలబడిపోతుంది. అలానే కదా మనం up అండ్ downs లో ఉన్నప్పుడు మాటని, మౌనాన్ని సమానంగా నిలబెట్టుకోవాలి. స్ట్రీట్ లైట్ పనిచేయాలంటే కరెంట్ అందాలి, అది అందితే లైట్ ప్రకాశవంతమవుతుంది. అలాగే కదా మనం మన స్నేహితులని, కుటుంబ సభ్యులని కలుపుకుంటూ positive vibeతో ప్రకాశించాలి. స్ట్రీట్ లైట్ ఎంత ఎత్తులో ఉన్న వెలుగులు నింపడానికి తలని దించుకునే ఉంటుంది. అలానే కదా మనం ఎంత గొప్ప స్థానంలో ఉన్న down to earth ఉండాలి, ఇతరులకు వెలుగులు పంచాలి. ఇంతే కాక ప్రపంచం నిద్రపోతున్న వేళ స్ట్రీట్ లైట్ చాలా మందికి ఇల్లు అవుతుంది. బిచ్చగాళ్లు, వీధి బాలలు, దేశ దిమ్మరులు, అనాధలు, వీధి కుక్కలు, నిరాశ్రయులు ఇలా ఎందరికో ఇల్లు అవుతుంది. అలానే మనం ఈ చిన్ని జీవితంలో ఎదురైన వాళ్ళని పెద్ద మనసుతో పలకరిద్దాము.

Ch.J.v.k.s.swaroop

Popular posts from this blog

ISSUES IN IMPLEMETING KAVACH SYSTEM ?

ON WHAT FACTORS STATES SHOULD MEASURE THE SUCCESS OF FREE BUS SCHEME FOR WOMEN ? HOW EVIDENCE BASED ADMINISTRATION WILL HELP TO MEASURE IT ?

Criticism on Civic volunteer system in Westbengal & How Politics-Civic volunteer nexus is working in west bengal ?